గుండ్ల పోచంపల్లి పరిధిలోని కండ్లకోయలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో బుధవారం మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి ఒడి విడిచిన చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అంగన్వాడీలలో చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.