ఘట్కేసర్ ఏంపీడీవో ఆఫీసులో గురువారం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మేల్యే మల్లారెడ్డి పాల్గొని బీసీలను మరింత ప్రోత్సహించాలన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ. నువ్వు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వజ్రెష్ యాదవ్ వంటి బీసీ నేత ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అవుతాడు. నీ ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి బిసిలకు ఇవ్వు అని అనడంతో అక్కడ ఉన్నవారిలో నవ్వులు విరబుసాయి.