మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని తుమ్మ చెరువు కట్టపైన పాఠశాల బస్సులు, డీసీఎంలు, అలాగే భారీ వాహనాలు వస్తూ వెళ్లడం వలన తుమ్మ చెరువు కట్టపై ఇటీవల వేసిన రోడ్డు చాలా వరకు మధ్యలో నుండి పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడి రోడ్డు గుంతల మయంగా మారుతుందన్నారు. గతంలో తొలగించినటువంటి ఇనుప భారీ కేడ్ తిరిగి వేయవలసిందిగా మేడ్చల్ మాజీ వార్డ్ సభ్యులు పానుగంటి రవిందర్ మేడ్చల్ మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.