మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని శామీర్ పేట్ లో తన నివాసంలో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కలిశారు. నాగ్ పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం భూసేకరణ కోసం ఇస్తున్న నష్టపరిహారం చాలా తక్కువ ఉందని.. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. కనీసం వాస్తవ విలువలో 20 శాతం కూడా పరిహారం అందడం లేదని, వాస్తవ ధరల ప్రకారం పరిహారం ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్ధమని రైతులు రాజేందర్ కు వివరించారు.