హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఈ యాత్రలో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్ పాల్గొని భక్తులకు అభివాదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి, సుభాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.