మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామ్ సేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర పట్టణంలోని సంతోషి మాత దేవాలయం నుండి ప్రారంభమై బొడ్రాయి చౌరస్తా మీదుగా వీకర్ సెక్షన్ చేరుకున్నారు. అక్కడి నుండి జాతీయ రహదారి మీదుగా చెరువు కట్ట పైన ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ముగించారు. జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు.