Top 10 viral news 🔥


తెలంగాణలో దారుణం.. తల్లీకూతురు ఆత్మహత్య (VIDEO)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. హౌసింగ్ బోర్డులో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి రాజేశ్వరి, కూతురు వేద సాయిశ్రీ (11) ఏపీలోని పల్నాడు(D) మాచర్ల (M) గన్నవరంకు చెందిన వారీగా గుర్తించారు. భర్త సీతారాం రెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్య మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. DSP రాజశేఖర్ రాజు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.