కీసర మండలం, బోగారంలోని హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం కంప్యూటర్ సైన్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పై అంతర్జాతీయ సమావేశం - 2025 పోస్టర్ మరియు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమములో కళాశాల ఛైర్మన్ శ్రీ అరిమండ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 25 మరియు 26న జరిగే ఈ కార్యక్రమాన్ని రీసెర్చ్ స్కాలర్స్, ఫాకల్టీ మెంబర్స్ ఉపయోగించుకోవచ్చన్నారు.