మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండల కేంద్రం లోని హజరత్ సయ్యద్ జలాల్ ఉద్దీన్ ముల్తాని రెహ దర్గా ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదివారం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మల్లారెడ్డికి ముస్లిం మత పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, చాంద్ పాషా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.