
వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.32 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై, హైదరాబాద్‌లలోని 13 చోట్ల చేసి రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. వైఎస్ రెడ్డి ఇంటిలో మొత్తం రూ.32 కోట్ల విలువ చేసే నగదు, బంగారం స్వాధీనపరుచుకున్నారు. ముంబైలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా వైఎస్ రెడ్డి పనిచేస్తున్నారు.