గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డబిల్‌పూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీరామ్‌స్పిన్నింగ్ మిల్‌కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతి పై శ్రీరామ్ స్పిన్నింగ్ మిల్ గేట్ వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డును వాకబు చేశారు. సెక్యూరిటీ గార్డు నీళ్లు ఇవ్వగా తాగి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. బుధవారం అక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.