మేడ్చల్ జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. రాంపల్లిలోని దాయార గ్రామానికి చెందిన కందాడి ధనలక్ష్మి తన కొడుకుని తీసుకుని ఈసీఐఎల్ వెళ్తుండగా రాంపల్లి చౌరస్తాలో బైక్ ముందు టైర్ స్కిడ్ అయి పెట్రోల్ ట్యాంకర్ వెనుక టైర్ కింద పడిపోయింది. గాయాలు కావడంతో వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.