కార్మికుల సంక్షేమం కోసం తలసాని శంకర్ యాదవ్ ఎంతో కృషి చేశారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం షామీర్ పేట లోని తుర్కపల్లి లో ని బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ వర్తకుల సంఘం అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ప్రదమవర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తలసాని శంకర్ యాదవ్ విగ్రహాన్ని మాజీమంత్రులు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు.