

బిర్యానీలో బల్లి.. షాకైన కస్టమర్ (వీడియో)
TG: హోటల్లో బిర్యానీ సగం తిన్న తర్వాత అందులో బల్లి కనపడటంతో కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలోని MEHFIL హోటల్లో ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా బల్లి దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు కృష్ణారెడ్డి హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే బాగా ఉడికింది కదా.. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. వెంటనే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.