బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని చెంగిచెర్ల బృందావన్ కాలనీలో రోడ్డు గుంతలు ఏర్పడడంతో స్థానిక కాలనీవాసులు ఈ యొక్క సమస్యను మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన కొత్త లక్ష్మి రవిగౌడ్ గురువారం బృందావన్ కాలనీలో గుంతలు పడిన చోట మరమ్మత్తులు చేయించడం కోసం పని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.