మేడ్చల్ జిల్లా పీర్జాదిగ
ూడ లోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇనస్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుళ్లిన, గడువు మీరిన ఆహారపదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు.