మేడ్చల్ నుండి కిష్టాపూర్ వెళ్లే దారిలో ప్రశాంతి వెంచర్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని మినీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. 108 వాహనంలో ఆసుపత్రికి ద్విచక్ర వాహనదారున్ని తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.