ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో ఎలాంటి తప్పులు జరుగకుండా పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలంలోని పోతారం గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేలో నమోదైన వివరాల నివేదికలను జిల్లా అదనపు కలెక్టరు రాధికగుప్తాతో కలిసి కలెక్టరు పరిశీలించారు.