అన్నోజీగూడ మొబైల్ షాప్ లో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో ఏంఐ మొబైల్ షాప్ లో చోరీ. పదిహెను లక్షల విలువ గల 67 మొబైల్ ఫోన్స్ తో పాటు ఎల్ఈడి టివిలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. మొదట ఎస్ఎల్ఎన్ మొబైల్ షాప్ వద్ద చొరికి ప్రయత్నం చేసిన దొంగలు, అట్టి షాప్ శెట్టర్ తెరుచుకోకపడంతో పక్కనే ఉన్న ఏంఐ మొబైల్ షాప్ లో చోరీ చేసి పారిపోయిన దొంగలు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్క్లూస్ టీం తో వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.