మేడ్చల్ జిల్లా. ఘట్కేసర్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. శుక్రవారం రాత్రి నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో కాలనీలో సంచరించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇంటి తాళాలను పగులగొట్టేందుకు వీలుకాకపోవడంతో అక్కడ నిలిపిన ఓ బైక్ను ఎత్తుకెళ్లారు. దొంగల సంచారంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.