పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా స్వాగతం

81చూసినవారు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం హైదరాబాద్ శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో అభిమానులకు, నాయకులకు అభివాదం చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యలో శామీర్పేట్ మండలం తుర్కపల్లిలోని రాజీవ్ రహదారిపై కాసేపు ఆగి తన కారు ఎక్కి అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ని చూసేందుకు అభిమానులతో పాటు జనం పోటెత్తారు.