ఇంటింటికి, గడపగడపకు యోగ కార్యక్రమంలో భాగంగా శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు గిర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శైలజ హరినాథ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వికుల మాటను ఆదర్శంగా తీసుకుని ఇంటింటికి, గడపగడపకు యోగ కార్యక్రమాన్ని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.