నాగోల్, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ మరియు "మిర్యాల కిచెన్" హోం ఫుడ్ బిజినెస్ వ్యవస్థాపకుడు మిర్యాల గౌతమ్ మురళి, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని మిర్యాల గౌతమ్ మురళికి AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు. మిర్యాల గౌతమ్ మురళి మాట్లాడుతూ,"తెలుగు AI బూట్ క్యాంప్ అనుభవం అద్భుతంగా అనిపించిందన్నారు. ఇది కేవలం ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, నెట్‌వర్కింగ్, వ్యాపార వ్యూహాలు తెలుసుకునే గొప్ప అవకాశంగా మారిందన్నారు.. నమ్మకం పెరిగింది, ప్రేరణ లభించింది, ఇక అమలు చేయడం మిగిలిందని ఈ అద్భుతమైన కమ్యూనిటీతో ముందుకెళ్లడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను!" అని అన్నారు.