విద్యార్థులకు బస్సు పాసుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్ బస్సు భవన్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. పేద విద్యార్థులు ప్రతిరోజూ దూర ప్రాంతాల నుంచి ప్రయాణించాల్సి వస్తుందనీ, ధరలు పెరగడం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 20% పెంపును వెనక్కు తీసుకుని 10% లోపే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.