భారతదేశ రాజ్యంగం వజ్రాయుధం లాంటిదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. సివిల్ సర్వీసులో ఉత్తమ ర్యాంకులు సాధించిన 17 మందిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సత్కరించారు. అత్యధిన జనాభా, యువత ఉన్న మనదేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా మాజీ గవర్నర్ సూచించారు.