జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ముషీరాబాద్ నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని శనివారం సూచించారు. నగర అభివృద్ది, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.