ముషీరాబాద్ నియోజకవర్గంలో , హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్, టిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. రాంనగర్ చౌరస్తా , జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ స్వామి ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగను జరుపుకుంటూ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సూచించారు.