మదర్స్ డే సందర్భంగా అమ్మా మాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ జేఏసీ కలిసి బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేడుకలు నిర్వహించాయి. కార్యక్రమంలో బొమ్మ అశోక్, రంజిత భూపాల్ రెడ్డి, దాసి దయానంద, హైమవతి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అర్జున్ రావు "తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో కాకుండా ప్రేమతో గౌరవించాలి" అని సందేశం ఇచ్చారు.