ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ సూచించారు. గాంధీనగర్ లోని జనప్రియా అబొడ్స్ అపార్ట్ మెంట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం కార్పొరేటర్ ప్రారంభించారు. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.