ముషీరాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు షాదీ ముబారక్ 127, కళ్యాణ లక్ష్మీ 70 మొత్తం 197 చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, కుమారి రచన శ్రీ తో కలిసి శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జై సింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.