సిద్ధిపేట జిల్లాలో శనివారం ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. మొత్తంగా ఏడుగురు యువకులు డ్యాంలో ఈతకు దిగారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. బాధితులను హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.