హైదరాబాద్: మున్నూరుకాపుల ఆత్మగౌరవ మహాధర్నా

63చూసినవారు
మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా ఘనంగా ఆదివారం ఇందిరా పార్క్‌లో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పూజలు నిర్వహించి ధర్నా ప్రారంభించారు. మున్నూరుకాపులకు రూ. 5 వేల కోట్లతో కార్పొరేషన్, మంత్రి పదవులు, భవన నిర్మాణ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్