తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్టు టైం అధ్యాపకుల అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జూలు నాగేశ్వర్, తదితరులు ఉన్నారు.