కొండపోచమ్మ సాగర్ లో సరదాగా సెల్పిలు దిగుతూ అందులో పడి ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ముషీరాబాద్ లో ఏడుగురు యువకులు ఉదయం 9 గంటలకు ముషీరాబాద్ నుంచి బైకుపై బయలుదేరారు. ఇందుకు సంభందించిన వీడియో సీసీ పూటేజీలో రికార్డు అయింది. ఎంతో ఉత్సాహంగా వెళ్లిన యువకులు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ముషీరాబాద్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.