టీజీ ఫుడ్స్ కార్యాలయంలో మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, కర్మాగారాన్ని సోమవారం మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పని విధాన్నాని అడిగి తెలుసుకున్నారు. శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తక్షణం కవర్ చేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. కాగా అంగన్వాడి కేంద్రాలకు బాలామృతంతో సహా పలు ఆహార పదార్థాలను టీజీ ఫుడ్స్ సరఫరా చేస్తోంది.