2022లో విడుదలైన 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లెక్చరర్ పోస్టులకు నియామక పత్రాలు పంపిణీ చేసినప్పటికీ, తమ భవిష్యత్తు అనిశ్చితంగా మారిందని గురువారం హైదరాబాదలో మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులు వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఖాళీగా ఉన్న 308 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.