పెబ్బేరు ఎసైపై డీజీపీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు

74చూసినవారు
వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీసీ పొలిటికల్ జేఏసీ మంగళవారం లక్డికాపూల్లో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ, హరిప్రసాద్ రెడ్డి లంచాలు తీసుకుంటూ, బాధితులను బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్