ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో, శనివారం హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులు హిమాయత్‌నగర్‌లో సంబరాలు జరిపారు. రాష్ట్ర నాయకుడు కేశబోయిన శ్రీధర్ నేతృత్వంలో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచారు. బీజేపీ కార్యకర్తల కృషి ఫలించిందని అభిప్రాయపడ్డ నేతలు, తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.