తెలంగాణ బడ్జెట్‌పై అసంతృప్తిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. "అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో" అంటూ ప్లకార్డులతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ. 1. 58 లక్షల కోట్ల అప్పుతో మహిళలకు రూ. 2, 500, వృద్ధులకు రూ. 4, 000 పించన్, ఆడపిల్లలకు స్కూటీలు, తులం బంగారం వంటి హామీలు అమలు చేశారా? అని నిలదీశారు.