నాంపల్లిలో దారుణ హత్య – విచక్షణలేని కత్తి దాడి

81చూసినవారు
నాంపల్లి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల వల్ల బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్