అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి స్మృతికి కాంగ్రెస్ మైనారిటీ ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్ బండ్ వద్ద క్యాండిల్ ర్యాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు పాల్గొని మాట్లాడుతూ తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సివిల్ ఏవియేషన్ మంత్రి దీనిపై స్పందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, దేవుడు వారికి ఆరోగ్యం, శక్తిని అందించాలని ప్రార్థించారు.