కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణ చరిత్రలో కీలక నిర్ణయాలుగా నిలుస్తాయని హైదరాబాద్ గాంధీ భవన్‌లో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కులగణన సర్వే చేపట్టి పూర్తి చేశాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీల కోసం ఏం చేసిందో కవిత, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ అని మరోసారి నిరూపితమైంది అన్నారు.