
ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్: చంద్రబాబు
పహల్గామ్ పేరు వింటేనే ఆ విషాదం గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "తిరంగా ర్యాలీకి ప్రజలే శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా చూడగానే దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయి. దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు. భూ భాగంలోకి వెళ్లి ఉగ్రతండాలను ధ్వంసం చేశాం. దేశ రక్షణలో పాతికేళ్ల కుర్రాడు మురళీ నాయక్ మనకు స్ఫూర్తి. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్." అని చంద్రబాబు తెలిపారు.