సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం హైదరాబాద్ జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతర్ రాష్ట్ర నీటి సమస్యలపై చర్చించుకున్నారు.