వరంగల్ బీసీ సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి కులాన్ని దూషించారని ఆరోపిస్తూ, తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం హైదరాబాద్ లక్డికాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిని, మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.