కాంగ్రెస్ నేతలకు బుద్ధి జ్ఞానం ఏమి లేదు: బిజెపి ఎమ్మెల్యే

82చూసినవారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంగిత జ్ఞానం, బుద్ధి ఏమి లేదని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. మంగళవారం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలందరికీ నచ్చిన వికాసిత్ భారత్ బడ్జెట్ కాంగ్రెస్ కు మాత్రమే నచ్చట్లేదన్నారు. స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ చూడలేదని దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. సామాన్య ప్రజలను అదుకునేల బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్