బీఆర్ఎస్ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బల్మూర్ వెంకట్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు గురువారం బషీర్‌బాగ్లోని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల పరువు ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.