హైదరాబాద్ అబ్కారీ భవన్‌లో శుక్రవారం జరిగిన సమన్వయ సమావేశంలో డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ, రెండు శాఖలు కలిసి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. యువతను మత్తులోకి దింపే డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు జాయింట్ రైడ్స్, కామన్ ఇంటెలిజెన్స్ టీమ్, వాట్సాప్ గ్రూపులు వంటి చర్యలు అవసరమని చెప్పారు.