దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (WPS)–2025లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తరఫున శుక్రవారం ప్రాతినిధ్యం వహించిన డీజీ, సీపీ సీవీ ఆనంద్ “ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు”లో ప్రపంచ స్థాయిలో తొలి స్థానాన్ని సాధించారు. మాదకద్రవ్యాలపై హైదరాబాద్‌లో చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వినూత్న విధానాలు ఈ గౌరవానికి కారణమయ్యాయి.