కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచల యుగంధర్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూపు కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండు కారణమయ్యారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.